బాలసుబ్రమణ్యం - ఇళయరాజా స్నేహ బంధం కొన్ని దశాబ్దాల బంధం . వీరు ఇద్దరు కలిసి తెలుగు , తమిళ సినిమా ల లో అద్భుతాలు చేసారు. వీరి పాట - సంగీత విజయ .పరంపర దశాబ్దాలు సాగింది . కేవలం కెరీర్ పరంగానే కాకుండా చాలా స్నేహంగాను ఉన్నారు . కానీ ఈ మధ్య జరిగ్గిన పరిణామాలు చూస్తే కొంత దూరం పెరి గింది అన్నమాట వాస్తవం . ఈ విషయం ఎంత వరకు వెళ్ళింది అంటే ఎస్పీబీ కి ఇళయరాజా తన పాటలు పడొద్దు అని లీగల్ నోటిస్ ఇచ్చేంతవరకు .

విదేశాల్లో సంగీత విభావరీలు ఇస్తున్న బాల సుబ్రమణ్యానికి , స్నేహితుని లీగల్ నోటీసు షాక్ కి గురి చేసింది. తన బాధ ని ఒక టీవీ షో ద్వారా ఆవేదనతో చేప్పారు బాలు . కొంత కాలం వరకు ఇళయరాజా సంగీతం లో వచ్చిన పాటలు బాలు పాడలేదు . ఇప్పుడు లేటెస్ట్ గా ఇళయరాజా పుట్టిన రోజు సందర్బముగా విభావరి కోసం బాలు తన గొంతు విప్పనున్నారు . వీరిద్దరి మధ్య దూరం తగ్గి స్నేహం రీలోడ్ అయినట్టే .

ఫ్రెండ్షిప్ రీలోడెడ్ - బాలసుబ్రమణ్యం , ఇళయరాజా