మల్లేశం ట్రైలర్ - ఎమోషనల్- ఇన్స్పిరేషనల్ జర్నీ

    పద్మశ్రీ చింతకింటి మల్లేశం , ఆసు యంత్రం ఆవిష్కర్త . చేతులతో మగ్గం వేసి వేసి భుజాలు అరిగిపోయిన తన అమ్మ కష్టం చూడలేక మల్లేశం మెదడులో నుంచి వచ్చిన అద్భుత ఆవిష్కరణ - ఆసు యంత్రం . ఎంతో మంది చేనేత కార్మికుల కష్ష్టం తీర్చిన మల్లేశం కి భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది . ఇప్పుడు అతని జీవితం " మల్లేశం " బయోపిక్ గా తెరకెక్కింది .


   మల్లేశం చదువుకుంది కేవలం 8 వ తరగతి లోపే . ఆవిష్కరణలకి చదువుకి , పరిస్థితులకి సంబంధం లేదు అని నిరూపించిన మల్లేశంగా ప్రియదర్శి కనిపించనున్నారు సినిమాలో . ట్రైలర్ ఆద్యంతం మల్లేశం ఎమోషనల్ జర్నీ కనిపించింది . ఒక సాధారణ వ్యక్తి నుంచి ఎంతో మంది చేనేత కార్మికుల కష్టం తీర్చిన మల్లేశం వరకు చూపించారు . తెలంగాణా గ్రామీణ వాతావరణం , యాస , సంసృతి కనిపిస్తుంది . మంచి నటుడు అయిన ప్రియదర్శి నుంచి చాలా ఎక్సపెక్ట్ చేయచ్చు అనిపిస్తుంది . వచ్చిన అన్ని బయోపిక్ లలో మల్లేశం ప్రత్యేకం కానుంది అనడం లో ఎలాంటి సందేహం లేధు .
ట్రైలర్