సినిమాలలో , యాడ్స్ లో ఇంకా పబ్లిక్ ఫంక్షన్ లో తళుక్కున మెరిసే కాజల్ అగర్వాల్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మేకప్ లేని తన ఫోటో లని షేర్ చేసింది . మనల్ని మనం అక్సప్ట్ చేసుకున్నప్పుడే మనం సంతోషంగా ఉంటాము అని , లక్షల్లో డబ్బులు తగలేసి తాము పర్ఫెక్ట్ ఉన్నాము అనుకోవడం , దానికి మీడియా గ్లోరిఫై చేయడం వల్ల అదే కరెక్ట్ అని బ్రతకడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు తన పోస్టులో . మేకప్ బ్యూటీ ప్రోడక్ట్ లు వాడడం అనేది వ్యక్తిగత అంశం అయినా వాటివల్ల వ్యక్తిత్వం ఎమన్నా మారుతుందా అని ప్రశ్నిచడం కొసమెరుపు .


        నెటిజెన్ల నుం చి మాత్రం ప్రశంసలు లభిస్తున్నాయి ఈ ఫొటోలకి . గ్లామర్ ప్రపంచం లో అది అగ్రగామి గా ఉండి ఆ ఫోటోలు షేర్ చేయడానికి గట్స్ ఉండాలి అని . మేకప్ లేకుండా మరింత అందంగా ఉన్నారు అని కామెంట్ ల రూపం లో ప్రశంసలు గుప్పించారు నెటిజన్లు . ఈ మధ్య వరుస ఫోటో షూట్ లతో అలరిస్తున్న కాజల్ అగర్వాల్ ఈ ఫోటోలు షేర్ చేయడం సంచలనమే మరి ,

మేకప్ లేని ఫోటో లు షేర్ చేసిన కాజల్ అగర్వాల్ - నెటిజెన్ల ప్రశంస